Wednesday 28 May 2008

10-04-1985(1)

"ఊళ్ళో ఇంతమంది కుఱుపులు కోశాను కానీ ఈ నా చిన్ని కుఱుపంత బాధ ఎప్పుడూ చూడలేదు" అన్నాట్ట ఓ నాటు వైద్యుడు. ఊళ్ళో అంతమందీ ఎంత బాధపడ్డారో అతనికేం తెలుస్తుందీ! అవన్నీ వారికి. మఱి ఈ బాధ తనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది తన బాధ కనుకా.

ఏదైనా అంతే - తనదాకా వస్తే గానీ ఏదీ తెలియదు. తెలియదంటే అసలు తెలియదని కాదు. పూర్తిగా తెలియదని మాత్రమే. ఒకొక్కసారి ఎవరో, ఏదో తన గొడవ చెప్పి గోల పెడితే ఇదేమంత గొప్ప విశేషమని ఇలా లబలబలాడతాడితనూ అనిపిస్తుంది. అదే, అంతకన్నా చిన్నదే తనకు కలిగినపుడు ఊరంతా ఒకటి చేదామన్న ఆవేశం వస్తుంది. ఆవేదన కలుగుతుంది.

మనమెంత లోకజ్ఞానం కలవారమైనా, ఎంత సమవర్తులం అని అనుకున్నా అదంతా కేవలం భ్రమ మాత్రమే. ఆ! మరీ విచిత్రం - ఇంత తలక్రిందులయిపోతున్నాడేమిటీ ఈ చిన్నదానికీ అనే అనుకుంటాం - అది వేరొకరికి సంబంధించినది అయినపుడు.

1 comment:

Creative Channel said...

నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది.
నా ఫిలిం కూడా చూసి చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను
మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkow