Wednesday 13 June 2007

17-07-1985(3)

రెక్కలాడితే గానీ బొక్కలాడడం సంభవం కాని జనం నూటికి తొంభై మందికి పైగా ఉన్న దేశంలో పని విలాసం కాదు. తన కడుపు నింపుకోవడానికే తాను పొద్దస్తమానం పని చేయక తప్పదు. ఆంతచేసినా ముప్పూటా ఇంత ముద్ద దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఈ కర్మ పరతంత్రత తప్పనిసరి. ఎవరినో ఉద్ధరించడానికి కాదు. తన సంతానాన్ని సుఖపెట్టడానికీ కాదు.... తాను జీవించడానికి మాత్రమే. అందుతో కటకటగా ఏదో కలో అంబలో దొరికితే చాలునని కర్మభూమికే అంకితమైపోయిన జనం అనుకుంటారు. అకర్మణ్యత వారికి గిట్టదు. నిర్వ్యాపారత్వం వారికి పడదు. ఏదో శ్రమించాలి. ఏదో ఇంత కడి సంపాదించుకోవాలి.

2 comments:

త్రివిక్రమ్ Trivikram said...

కృష్ణ మోహన్ గారూ!

విద్వాన్ విశ్వం గారి రచనలు అందిస్తున్నందుకు సంతోషం.

కలి, కడి లాంటి అందరికీ అర్థం కాని పదాలు వచ్చినప్పుడు మీరు వాటికి అర్థాలిస్తే బాగుంటుంది.

విద్వాన్ విశ్వం గారి "పెన్నేటి పాట", తులసీకృష్ణ (పి. రామకృష్ణారెడ్డి) గారి "పెన్నేటి కతలు" నాకు చాలా ఇష్టం (ఈ పుస్తకం నూకా రాంప్రసాద్ రెడ్డి ఇటీవలే పున:ప్రచురించారు).

కందర్ప కృష్ణ మోహన్ - said...

నా శక్తిమేర ప్రయత్నిస్తాను.