Wednesday 13 June 2007

17-07-1985(4)

ఒకప్పుడయితే "ఫలరసాదుల గుఱియరే పాదపములు, స్వాదుజలములనుండవే సకల నదులు, పొసగ భిక్షము పెట్టరే పుణ్యసతులు" అని అనుకునేవారు కానీ ఇప్పుడవేవీ కుదరవు. ఒక్క చెట్టు నీదనుకొని కాయో, కసరో కోసుకోగలవు. ప్రతి చెట్టూ ఎవరిదో అయ్యే ఉంటుంది. అది విఱగకాసినా ఆ పండును నీవు కోసుకోలేవు. నీకా అధికారం లేదు. సరే, నీరు సంగతి చెప్పనక్కఱేలేదు. వస్తే వఱదలు, లేకపోతే ఒక్క నీటిబొట్టు ఉండదు. తాగే నీటికోసం తహతహలాడే జనం దేశంలో ఎంతమందున్నారో లెక్కకట్టేవారు కూడా లేరు. పుణ్యసతులు మాత్రం ఏం చేస్తారు? తమకే బొటాబొటిగా సరిపోతున్న తిండితిప్పలతో ఇంకొకరికి ఏం పెట్టగలరు?
కాబట్టి బదకాలంటే పని చెయ్యాలి. పని చెయ్యడానికి తప్పితే నీవెందుకు?

No comments: